Sunday, December 22, 2024

పాక్‌లో బాంబు పేలుడు.. 11 మంది కార్మికుల మృతి

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని వజీరిస్థాన్‌లో గుల్మిర్‌కోట్ ప్రాంతంలో శనివారం రాత్రి ఓ వ్యాన్ వద్ద బాంబు పేలి 11 మంది కార్మికులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఉత్తర వజీరిస్థాన్ లోని షావల్ ప్రాంతం నుంచి కార్మికులు వ్యాన్‌లో దక్షిణ వజీరిస్థాన్ ప్రాంతానికి వెళ్తుండగా గుల్మిర్‌కోట్ ప్రాంతంలో ల్యాండ్‌మైన్ పేలి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలి లోనే 11 మంది చనిపోగా, క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. పేలుడు సమయంలో వాహనంలో 16 మంది కార్మికులున్నట్టు తెలుస్తోంది. పోలీస్‌లు, అధికారులు ప్రమాదస్థలం వద్దకు వెళ్లి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News