Sunday, December 22, 2024

మైనర్ హత్య కేసు విచారణలో ప్రత్యక్షమైన బాలుడు… ఆశ్చర్యపోయిన కోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఓ హత్య కేసు విచారణ జరుగుతోన్న సమయంలో ఏకంగా మృతుడిగా భావిస్తోన్న ఓ బాలుడు కోర్టులో హాజరు కావడంతో న్యాయమూర్తితోసహా అంతా ఆశ్చర్యపోయారు. ఈ కేసులో మృతుడిగా భావిస్తోన్న పిల్లాడి వయస్సు 11 ఏళ్లు. ఉత్తరప్రదేశ్ లోని పిలిభీత్‌కు చెందిన ఈ బాలుడి తరఫున వాదనలు వినిపిస్తోన్న న్యాయవాది మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం…2013లో బాలుడి తల్లి మరణించడంతో అతడు తన తాత, మేనమామల వద్ద ఉంటున్నాడు.

అదనపు కట్నం కోసం బాలుడి తండ్రి … తల్లిని కొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. కుమార్తె మరణంతో పిల్లాడి తాత… అల్లుడిపై కేసు పెట్టాడు. అలాగే చిన్నారి కస్టడీ కోసం ఇరు వర్గాల మధ్య కేసులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలో తన భార్య తరఫు వారు తన కుమారుడిని హత్య చేశారని ఆరోపిస్తూ బాలుడి తండ్రి ఫిర్యాదు చేశాడు. దాంతో వారిపై పోలీస్‌లు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ పిల్లాడి తల్లి తరఫు కుటుంబం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది.

అందుకు హైకోర్టు నిరాకరించడంతో వారు సుప్రీం కోర్టులోఅప్పీల్ చేసుకున్నారు. ఈ హత్య కేసు విచారణ జరుగుతోన్న సమయం లో చనిపోయాడని భావిస్తోన్న పిల్లాడు కోర్టు ముందు హాజరయ్యాడు. దీంతో అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, పిలిభిత్ ఎస్పీ, స్థానిక పోలీసులకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు పిటిషనర్లపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదనీ, వాటిలో పేర్కొంది. అలాగే వచ్చే ఏడాది జనవరికి విచారణ వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News