Friday, November 22, 2024

భారత్‌లో తొలి బర్డ్‌ఫ్లూ మరణం

- Advertisement -
- Advertisement -

11-year-old boy died of bird flu in Delhi Aiims

న్యూఢిల్లీ : ఢిల్లీ ఎయిమ్స్‌లో బర్డ్‌ఫ్లూతో 11 ఏళ్ల బాలుడు చనిపోయాడు. దీంతో ఆ బాలుడికి చికిత్స అందించిన వైద్యులు సిబ్బంది ఐసొలేషన్‌కు వెళ్లారు. భారత్‌లో బర్డ్‌ఫ్లూతో వ్యక్తి చనిపోవడం ఇదే మొదటిసారి. హర్యానాకు చెందిన సుశీల్ అనే బాలుడు న్యుమోనియా, లుకేమియా లక్షణాలతో ఈనెల 2న ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరాడు. కరోనా పరీక్షలో నెగిటివ్ వచ్చింది. ఆ నమూనాలను పుణె లోని జాతీయ వైరాలజీ సంస్థకు పరీక్ష కోసం పంపగా, బర్డ్‌ఫ్లూ అని బయటపడింది. దీంతో మరిన్ని కేసులను గుర్తించడానికి కాంటాక్ట్ ట్రేస్ చేయడానికి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఓ బృందాన్ని హర్యానా లోని బాలుడి స్వగ్రామానికి పంపింది. ఈనెల బర్డ్ ఫ్లూ వైరస్ జాతి అయిన హెచ్5 ఎన్ 6 స్ట్రెయిన్ చైనాలో ఓ వ్యక్తికి సోకినట్టు మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ ఏడాది ప్రారంభంలో భారత్‌లో మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్‌గఢ్, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ కారణంగా వేల సంఖ్యలో పక్షులు, కోళ్లు మృతి చెందాయి. పంజాబ్ లోనే 50 వేల పక్షులు మృతిచెందాయి. అయితే బర్డ్‌ఫ్లూ మనుషులకు సోకడం, ఇన్‌ఫెక్షన్ కలిగించడం తక్కువ శాతం అని, ఇది పెద్ద ప్రమాదం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

11-year-old boy died of bird flu in Delhi Aiims

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News