Monday, January 27, 2025

పతంగి ఎగరేస్తూ చెరువులో పడి బాలుడి మృతి

- Advertisement -
- Advertisement -

స్నేహితులతో కలిసి పతంగి ఆడుకుంటా ఇంట్లో వాళ్లకు చెప్పి బయటకు వెళ్లిన బాలుడు మృత్యువాపడిన సంఘటన సిద్దిపేట పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. సిద్దిపేట వన్ టౌన్ సిఐ వాసుదేవరావు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లెపు లింగం, పద్మ దంపతులు స్థానిక లెక్చరర్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వారి కుమారుడు అల్లెపు తేజకుమార్ (11) ఐదవ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం స్నేహితులతో ఆడుకుంటానని ఇంట్లో వాళ్లకి చెప్పి బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వన్ టౌన్ సిఐ వాసుదేవరావు ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ బాలుడి ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వెతికారు. బాలుడిని స్నేహితులను ఆరా తీయగా పతంగి ఆడుకుంటూ వెళ్లాడని తెలిపారు. బీడీ కాలనీలోని మత్స్యవారి కుంట చెరువులో పతంగి కనిపించడంతో అనుమానంతో చెరువులో గాలించగా బాలుడి మృతదేహం గురువారం లభించింది. బాలుడు మృతి చెందిన విషయాన్ని కుటుంబ సభ్యులుగా తెలుపగా మృతదేహాన్ని చూసిన తమ కుమారుడుగా తల్లిదండ్రులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News