Sunday, January 19, 2025

పుస్తకాలు కొనివ్వడం లేదని.. ప్రాణం తీసుకున్న 11 ఏళ్ల బాలుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తల్లిదండ్రులు పుస్తకాలు కొనకపోవడంతో మనస్తాపం చెంది 11 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని బెండలపాడులో సుధీర్ బాబు తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బాలుడు పుస్తకాల కోసం తల్లిదండ్రుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు.

డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో మనస్తాపానికి గురయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు. ఇదే జిల్లాలో జరిగిన మరో ఘటనలో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అనారోగ్యంతో మనస్థాపానికి గురైన ఎస్.విజయ్(19) తల్లాడ మండలం నారాయణపురం గ్రామంలోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్యంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News