Saturday, November 9, 2024

నిర్భయ హత్యోదంతం జరిగి నేటికి 11 ఏళ్లు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో నిర్భయ ఘటన జరిగి 11 ఏళ్లు గడిచాయి. పరిస్థితిలో ఏమా మార్పు లేదు. ప్రతి ఒక్కరి సహకరించడం వల్ల మాకు న్యాయం లభించింది. కాని 10 నుంచి 12 ఏళ్లుగా అనేక కేసులు దిగువ కోర్టులోనే మగ్గుతున్నాయి అని నిర్భయ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. 2012 డిసెంబర్ 16న ఒక 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థిని దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత క్రూరంగా అత్యాచారానికి, హత్యకు గురైంది. దేశాన్ని కుదిపేసిన ఈ అమానుష ఘటన దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారితీసింది. దక్షిణ ఢిల్లీలో నడుస్తున్న బస్సులో ఆ విద్యార్థినిపై ఆరుగురు మృగాళ్లు అత్యంత క్రూరంగా అత్యాచారానికి పాల్పడ్డారు.

నడుస్తున్న బస్సులో నుంచి ఆమెను రోడ్డుపైన విసిరేసి పారిపోయారు. 2021 ఇసెంబర్ 29న నిర్భయ పేరుతో ప్రపచానికి పరిచయమైన బాధితురాలు సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రిలో తుదివ్వాస విడిచింది. ఆరుగురు నిందితులలో ఒకడైన రాంసింగ్ కోర్టులో విచారణ ప్రారంభమైన కొద్ది రోజులకే తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకోగా మరో నిందితుడైన బాలనేరస్థుడు మూడేళ్లపాటు బాల నేరస్థుల కరెక్షనల్ హోమ్‌లో గడిపిన తర్వాత 2015లో విడుదలయ్యాడు. మిగిలిన నలుగురు నిందితులైన ముకేష్ సింగ్(32), పవన్ గుప్తా(25), వినయ్ శర్మ(26), అక్షయ్ కుమార్ సింగ్(31)కు 2020 మార్చి 20న తీహార్ జైలులో ఉరిశిక్ష అమలైంది.

ఇప్పటికీ&ఎక్కడైనా అత్యాచార ఘటనలు జరిగినపుడు ఏ ఒక్కరూ బాధితుల పక్షాన నిలబడరని నిర్భయ తండ్రి తండ్రి బద్రీనాథ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. యావద్దేశం తమ పక్కన నిలబడింది కాబట్టే తమకు న్యాయం లభించిందని, మా కుమార్తెకు న్యాయం లభించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు సాయపడిందని ఆయన అన్నారు. మహిళల పట్ల నేరాలు ఈనాటికీ తగ్గలేదని నిర్భయ తల్లి ఆశాదేవి తెలిపారు. చట్టాలు చేశారు కాని పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. సమాజంలో మార్పు వచ్చే అవకాశమే లేదని ఒక్కోసారి నిరాశ చుట్టుముడుతుంటుంది. మా దగ్గరకు కూడా చాలా కేసులు వస్తుంటాయి. కాని నైతిక మద్దతు తప్ప మేము ఏమీ ఇవ్వలేము అంటూ ఆమె అసహాయతను వ్యక్తం చేశారు. నిర్భయకు న్యాయం చేసినంత మాత్రాన అందరికీ న్యాయం చేసినట్లు కాదని బద్రీనాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.

కొత్త సంవత్సరం నాడు న్యూఢిల్లీలో అంజలి అనే మహిళను కారుతో ఈడ్చుకెళ్లిన ఘటనలో ఏం జరిగిందని ఆయన ప్రశ్నించారు. నిందితులు తాగి ఉన్నారని దర్యాప్తులో తేలిందని, అయితే అంజలి తప్పు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. 2022 డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఢిల్లీలో ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఉద్యోగిని అంజలీ సింగ్‌ను కొందరు దుండగులు కారుతో ఈడ్చుకెళ్లారు. తీవ్ర గాయాలతో కారు కిందనే ఆమె మరణించింది. 12 కిలోమీటర్లు అంజలిని ఈడ్చుకెళ్లిన దుండగులకు ఏం శిక్ష పడిందని ఆశా దేవి ప్రశ్నించారు. ఆమె కుటుంబాన్ని తాను కలిశానని, ఆమె తల్లికి ఆరోగ్యం బాగాలేదని, కుటుంబానికి అంజలి ఒక్కరే జీవనాధారమని ఆశాదేవి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News