యాప్‌లు ప్రమోట్ చేస్తున్న 11మందిపై కేసులు
యువతను పెడమార్గం పట్టిస్తున్న
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్లు,
పలువురు టీవీ నటులపై చర్యలు
మన తెలంగాణ/హైదరాబాద్: -బెట్టింగ్ యాప్‌లపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ఆ యాప్‌లను ప్రమోట్ చే స్తున్న సోషల్ మీడియా ఇన్‌ప్లూయన్సర్లతో పా టు పలువురు టీవీ నటులపై కేసులు నమోదయ్యాయి. కొద్ది రోజుల క్రితమే బయ్యా సన్నీ యాదవ్‌పై కేసు నమోదుకాగా తాజాగా మరో 11మందిపై పంజాగుట్ట పిఎస్‌లో కేసు నమోదైంది. వినయ్ వంగళ అనే వ్యక్తి ఫిర్యాదుతో ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, టెస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, శ్యామల, రీతూ చౌదరి, బం డారు షేషయాని సుప్రిత, అజయ్, సన్నీ, సుధీర్‌లపై కేసులు నమోదయ్యాయి. వీరిపై 318 (4) బీఎన్‌ఎస్,3,3(ఎ),4 టీఎస్‌జీఎ,66డి ఐటీఏ చట్టం -2008 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. యూట్యూబ్, వీడియోలు షాట్స్ తీస్తే ఎంత డబ్బు వస్తుంది. మంచి కంటెంట్ అయి తే వ్యూస్‌ని బట్టి చెప్పగలం. కానీ వీడియో మొ దట్లోనో,మధ్యలోనో బెట్టింగ్ యాప్స్‌నకు ప్ర మోషన్లు చేస్తే వేలల్లో,
వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ నెల 21న సజ్జనార్‌తో సహా కొంతమంది సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్‌చేస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. యువతను తప్పుదోవ పట్టించే విధంగా బెట్టింగ్ యాప్‌లను సామాజిక మాధ్యమాల్లో ప్రమోట్ చేస్తున్నాడనే కారణంతో యూట్యూబర్ సన్నీయాదవ్‌పై పోలీసులు కొద్ది రోజుల క్రితం కేసు నమోదు చేశారు. తన బైక్ రైడింగ్ అనుభవాలను యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లాంటి సామాజిక మాధ్యమాలలో పోస్టు చేస్తూ చాలా చురుకుగా ఉంటాడు. ఈ నేపధ్యంలోనే తన ఫాలోవర్స్ అధికంగా ఉండడంతో పైసలకు ఆశపడి యువతను తప్పుదోవ పట్టించే విధంగా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నాడని, శాంతి భద్రతలు కాపాడేందుకు, యువత తప్పుదోవలో వెళ్లకుండా కాపాడేందుకు అతనిపై సుమోటోగా నూతనకల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లుగా సూర్యాపేట డిఎస్‌పి రవి తెలిపారు.