Tuesday, January 21, 2025

మధ్యాహ్న భోజనం వికటించి 110 మంది విద్యార్థులకు అస్వస్థత

- Advertisement -
- Advertisement -

నారాయణపేట జిల్లా, మాగనూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 110 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… మధ్యాహ్నం భోజనంలో భాగంగా అన్నం, పప్పు, గుడ్డు తిన్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో పాఠశాల ఉపాధ్యాయుడు వెంటనే స్థానిక ప్రభుత్వ వైద్యుడిని పాఠశాలకు పిలిపించి వైద్యం చేయించారు. కొంతమంది విద్యార్థ్ధులకు పాఠశాలలోనే ప్రథమచికిత్స అందించగా, పరిస్థితి విషమంగా ఉన్న మరి కొందరిని మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో తీవ్ర అస్వస్థతకు గురైన ముగ్గురు విద్యార్థులను మహబూబ్‌నగర్ ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. కాగా,

మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురైన విద్యార్థులను తమ తమ ఇళ్లకు వెళ్లవలసిందిగా ఉపాధ్యాయులు భయపెట్టినట్టుగా పలువురు తెలిపారు. దీనివల్ల ఫుడ్ పాయిజన్ విషయాన్ని దాచిపెట్టడానికి పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న డిఈఓ అబ్ధుల్‌ఘని పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థ్ధి సంఘాల నాయకులు, వంట ఏజెన్సీ, పాఠశాల హెచ్‌ఎం నిర్లక్షమే సంఘటనకు కారణమని డిఒఓతో వాగ్వాదానికి దిగారు. గతంలో పాఠశాలలో ఫుడ్ పాయిజన్ విషయంలో పై అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడంతో వంట ఏజన్సీ సభ్యులు, హెచ్‌ఎం నాణ్యమైన భోజనాన్ని అందించడంలో నిర్లక్యం వహించారని ఆరోపించారు. వెంటనే వంట ఏజెన్సీని మార్చాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News