Thursday, November 14, 2024

కరోనాను జయించిన 110ఏళ్ల వృద్ధుడు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: శతాధిక కురువృద్ధుడు కరోనాను జయించాడు. 110ఏళ్ల రామానందతీర్ధకు వైద్యచికిత్సలు అందించి కరోనా వైరస్ బారినుంచి ఆయన ప్రాణాలు కాపాడిన గాంధీ ఆస్పత్రి వైద్యబృందం మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. రామానందతీర్ధ నిమోనియాతో బాధపడుతూ చికిత్సకోసం గత నెల 24న సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఆక్సీజన్ మీద చికిత్స తీసుకుంటున్న రామానంద తీర్ధ కోలుకోవటంతో ఆయన్ను ఆస్పత్రివైద్యులు డిశార్జ్ చేశారు. రామానందకు ఆయినవారు ఎవరూ లేకపోవటంతో గాంధీలోనే 7వ ఫ్లోర్‌లో బస ఏర్పాటు చేసిన ఆస్పత్రి సూపరిడెంట్ రాజారావు మానవత్వం చాటుకున్నారు.

110 years Old Man Recovers from Covid 19 at Gandhi Hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News