Friday, April 25, 2025

పుణే లో 111 మంది పాకిస్థానీయుల బహిష్కరణ

- Advertisement -
- Advertisement -

భారతదేశం నుంచి పెద్ద ఎత్తున పాకిస్థానీయులను ఇంటికి వెళ్లగొట్టే పని జోరందుకుంది. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని పుణే నగరం నుంచి 111 మంది పాకిస్థానీ జాతీయులను వెంటనే పుణే విడిచిపెట్టి వెళ్లాలని స్థానిక అధికారులు ఆదేశించారు. ఈ నెల 27వ తేదీలోగా పాకిస్థానీయులు వలస వెళ్లాల్సి ఉంటుంది. కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు నరమేథం సృష్టించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిన దశలో పాకిస్థాన్ పౌరులపై వేటు పడుతోంది దీనితో దేశవ్యాప్తంగా పలు చోట్ల అక్రమంగా తిష్ట వేసుకుని ఉన్న పాకిస్థానీయులు మూటాముల్లె సర్దుకుంటున్నారు. సాధ్యమైనంత త్వరగా కేవలం రోజుల వ్యవధిలోనే దేశం విడిచి పెట్టి వెళ్లాల్సి ఉంటుందని అధికారులు ఆదేశించారు. దీనితో పలు చోట్ల లభ్యం అయిన రవాణా సౌకర్యాలను వినియోగించుకుని పాకిస్థానీయులు తిరిగి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.

పుణే జిల్లా కటెక్టరు జితేంద్ర దూది తరలింపు సంబంధిత ప్రకటన వెలువరించారు. కేవలం చికిత్స సంబంధిత సర్టిఫికెట్లు ఉన్న వారిని కొంత గడువు మేర ఇక్కడ ఉండేందుకు అనుమతిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. తక్షణమే పాకిస్థానీయులను దేశం నుంచి బహిష్కరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రాలకు ఆదేశాలు వెలువరించారు. ఇప్పటికే పాకిస్థానీయుల వీసాలను రద్దు చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రులు అంతా సహకరించాలని సూచించారు. దేశంలోని పలు ప్రాంతాలలో పాకిస్థానీల నివాస పత్రాల తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పటికే భారీ సంఖ్యలో సరిహద్దుల్లోని అటారి వాఘా సరిహద్దుల వద్ద పాకిస్థానీ జాతీయుల డాక్యుమెంట్లను బిఎస్‌ఎఫ్ అధికారులు తనిఖీ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News