Friday, November 22, 2024

ఎపిలో మరో 114 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

114 New Covid-19 Cases Reported in Andhra Pradesh

అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 25,542 మందికి కరోనా పరీక్షలు చేయగా 114 మందికి కొత్తగా కోవిడ్-19 సోకింది. అదే సమయంలో మరో 326 మంది కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 24, విశాఖపట్నంలో 22 కేసులు బయటపడ్డాయి. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 1 కేసు, కడప జిల్లాలో 2, విజయనగరంలో 3, అనంతపురంలో 3, పశ్చిమ గోదావరిలో 4 కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య8,85,824కి చేరాయి. 24గంటల వ్యవధిలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 7,139 మంది కరోనాతో మృతి చెందారు. ఎపిలో ప్రస్తుతం 1,987 కరోనా యాక్టివ్ కేసులుండగా… ఇప్పటివరకు 8,76,698 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని వైద్య అధికారులు వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News