Wednesday, January 22, 2025

ఈ ఏడాది 29 దేశాల్లో 115 మంది మీడియా వర్కర్ల చంపివేత

- Advertisement -
- Advertisement -

జెనీవా: ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 29 దేశాల్లో 115 మంది మీడియా సిబ్బంది చంపివేతలకు గురయ్యారు. కాగా ఉక్రెయిన్, మెక్సికోలలోనే అత్యధిక చంపివేతలు జరిగాయి. ఈ వివరాలను జెనీవాలోని మానవ హక్కుల సంస్థ నివేదించింది. ప్రాంతీయాల వారీగా చూసినప్పుడు లాటిన్ అమెరికాలో 39 మంది జర్నలిస్టులు, యూరొప్‌లో 37 మంది, ఆసియాలో 30 మంది, ఆఫ్రికాలో 7 మంది, ఉత్తర అమెరికాలో ఇద్దరు జర్నలిస్టులు చంపివేతలకు గురయ్యారు. ‘ప్రెస్ ఎంబ్లెమ్ క్యాంపెయిన్’(పిఈసి) ఈ వివరాలను వెల్లడించింది. 1992 నుంచి 1999 వరకు జరిగిన నాటి యుగోస్లావియా యుద్ధం నుంచి ఇప్పటి వరకు యూరొప్‌లో జర్నలిస్టులకు గడ్డు కాలంగానే ఉంది.

రష్యా ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై దాడి మొదలెట్టినప్పటి నుంచి కనీసం 34 మంది చనిపోయారు. అందులో ఎనిమిది మంది జర్నలిస్టులు డ్యూటీలో ఉండగానే చంపివేతకు గురయ్యారు. 17 మంది బాధితులతో మెక్సికో రెండో స్థానంలో ఉంది. వారంతా క్రిమినల్ గ్యాంగ్‌లకు బలయ్యారు. ఇంకా హైతీ(మూడో స్థానం), ఇండియా(నాలుగో స్థానం), కొలంబియా(నాలుగో స్థానం), ఫిలిప్పీన్స్(ఐదో స్థానం), పాకిస్థాన్(ఆరో స్థానంలో) ఉన్నాయి. బంగ్లాదేశ్, హోండురాస్, ఇజ్రాయెల్/పాలస్థీనా, చాద్, ఈక్వెడర్, మయన్మార్, సోమాలియా, సిరియా, అమెరికా దేశాల్లో ఇద్దరేసి చొప్పున జర్నలిస్టులు హతమయ్యారు. విశేషమేమిటంటే అఫ్ఘానిస్థాన్‌లో ఈ ఏడాది ఎలాంటి జర్నలిస్టుల మరణాలు సంభవించలేదు. కానీ చాలామంది జర్నలిస్టులు అఫ్ఘానిస్థాన్‌ను వదిలి పారిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News