Friday, December 20, 2024

వేధింపులను ప్రతిఘటించిన మహిళపై దాడి… ముఖంపై 118 కుట్లు

- Advertisement -
- Advertisement -

118 Stitches on Woman face for tried to resist sexual assault

భోపాల్: లైంగిక వేధింపులను ప్రతిఘటించిన మహిళపై నిందితులు పేపర్ కట్టర్‌తో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి, చివరకు బాధితురాలి ముఖంపై శస్త్రచికిత్సలో 118 కుట్లు వేయించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. భోపాల్ లోని టిటి నగర్ ఏరియాలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. టిటి నగర్ రోషన్‌పుర లోని శ్రీప్యాలెస్ హోటల్‌కు ఆమె తన భర్తతో వెళ్లగా బైక్ పార్కింగ్ దగ్గర ఆమెకు, ముగ్గురు నిందితులకు మధ్య వాగ్వాదం జరిగింది.

ఆ సమయంలో భర్త హోటల్‌లో ఉన్నారు. ఆమెపై నిందితులు అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. అమర్యాదకరంగా ప్రవర్తించారు. దీంతో ఆ మహిళ వారిని ధైర్యంగా ఎదుర్కొని, ముగ్గురిలో ఒకరిని చెంపదెబ్బకొట్టారని పోలీసులు చెప్పారు. ఆ దంపతులు హోటల్ నుంచి బయటకు రాగానే నిందితులు పేపర్ కట్టర్‌తో ఆమెపై దాడి చేశారు. వెంటనే భర్త ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు శస్త్రచికిత్స చేసి ఆమె ముఖంపై 118 కుట్లు వేశారు. హోటల్ లోని ఫుటేజీని పరిశీలించి నిందితులు బాద్దా బేగ్, అజయ్ అలియాస్ బిట్టి సిబ్డేలను పోలీసులు అరెస్టు చేశారు. మూడో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ఉదయం బాధితురాలి ఇంటికెళ్లి పరామర్శించారు. వైద్యానికి పూర్తి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మహిళ ధైర్యాన్ని ప్రశంసిస్తూ రూ.లక్ష సాయం అందజేశారు.

118 Stitches on Woman face for tried to resist sexual assault

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News