Friday, November 22, 2024

274 రోజుల కనిష్ఠానికి క్రియాశీల కేసులు

- Advertisement -
- Advertisement -

11850 new covid cases recorded in india

న్యూఢిల్లీ : దేశంలో గత కొద్ది కాలంగా కరోనా వ్యాప్తి అదుపు లోనే ఉంది. క్రియాశీల రేటు ఊరటనిస్తుండగా, రికవరీ రేటు రానురాను మెరుగవుతోంది. ఈమేరకు శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలను విడుదల చేసింది. శుక్రవారం 12,68,589 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 11,850 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. కిందటి రోజు కంటే 5 శాతం మేర కేసులు తగ్గాయి. గత ఏడాది ప్రారంభం నుంచి 3.39 కోట్ల మంది కోలుకున్నారు. శుక్రవారం ఒక్క రోజే 12,403 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. గత కొద్ది కాలంగా కరోనా వ్యాప్తి అదుపు లోనే ఉండడంతో క్రియాశీల రేటు 0.40 శాతానికి చేరగా, రికవరీ రేటు 98.26 శాతానికి పెరిగింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 1,36,308 గా ఉంది. అవి 274 రోజుల కనిష్ఠానికి తగ్గుముఖం పట్టాయి. ఇక మరణాల సంఖ్యపై కేరళ ప్రభావం పడింది. దాంతో మృతుల సంఖ్య భారీగా పెరిగి 555కి చేరింది. ఇప్పటివరకు 4,63,245 మంది కరోనాకు బలయ్యారు. టీకా పంపిణీలో శుక్రవారం 58.42 లక్షల మంది టీకా వేయించుకోగా, మొత్తం 111కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News