Saturday, November 23, 2024

టిసిఎస్-ఇన్ఫోసిస్‌లలో 11,961 ఉద్యోగాల కోత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రెండు ప్రముఖ ఐటి కంపెనీలు టిసిఎస్, ఇన్ఫోసిస్‌లు మూడవ త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన సందర్భంగా పనిచేసే ఉద్యోగుల సంఖ్య తగ్గిందని తెలిపాయి. టిసిఎస్, ఇన్ఫోసిస్‌లు మూడో త్రైమాసిక ఫలితాలు వెల్లడించాయి. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగుల సంఖ్య 6101 తగ్గగా, టిసిఎస్‌లో 5860కి తగ్గిందని తెలిపాయి. ఇదే ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కూడా టిసిఎస్‌లో 6333కు తగ్గింది, దీంతో ఆ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 6,03,305కు చేరింది. దీంతో టిసిఎస్ అట్రిషన్ రేటు 14.9 శాతం నుంచి 13.3 శాతానికి తగ్గింది. అట్రిషన్ రేటు 13.3 శాతానికి తగ్గిందని టిసిఎస్ హెచ్‌ఆర్ మిలింద్ లక్కడ్ పేర్కొన్నారు. కాలేజీ క్యాంపస్ నుంచి రిక్రూట్ మెంట్ తీసుకుంటామని వివరించారు. టిసిఎస్‌లో చేరేందుకు యువత ముందుకు వస్తున్నారని చెప్పారు. 2024 ఆర్థిక సంవత్సరంలో 40 వేల మంది ఫ్రెషర్లను తీసుకోవాలని టిసిఎస్ ప్లాన్ చేస్తుందన్నారు.

ఇన్ఫోసిస్‌లో రెండో త్రైమాసికంలో 7530, మూడో త్రైమాసికంలో 6101కు తగ్గింది. గత సంవత్సరం నుంచి కూడా ఉద్యోగుల సంఖ్య 1627కు పెరిగింది. డిసెంబర్ 31, 2023 నాటికి కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 3,22,663కు చేరింది. ఇన్ఫోసిస్‌లో అట్రిషన్ రేటు 14.6 శాతం నుంచి 12.9 శాతానికి తగ్గింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News