Tuesday, December 24, 2024

11న సంగారెడ్డిలో “నిరుద్యోగ మార్చ్‌” : బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాలనే డిమాండ్‌తో ఈ నెల 11న ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రంలోని సంగారెడ్డిలో “నిరుద్యోగ మార్చ్‌” నిర్వహిస్తున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ బిఆర్‌ఎస్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాలనే డిమాండ్‌తో ఈ నెల 11న సంగారెడ్డిలో “నిరుద్యోగ మార్చ్‌” నిర్వహించబోతున్నామని వెల్లడించారు. “నిరుద్యోగ మార్చ్‌”కు నిరుద్యోగులు, ప్రజాస్వామికవాదులంతా భారీ ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు.

టిఎస్పీఎస్పీ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ సంబంధిత మంత్రి తన పదవికి రాజీనామా చేసేదాకా ఆందోళనలను చేస్తామన్నారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తాం. యుపిఎస్‌సి తరహాలో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తాం. లీకేజీకి ఆస్కారం లేకుండా పకడ్బందీగా పోటీ పరీక్షలను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News