Wednesday, January 22, 2025

టెన్త్ క్వశ్చన్ పేపర్ లీకైన కేసులో 12 మంది అరెస్ట్

- Advertisement -
- Advertisement -

12 Arrested in nandyal Tenth Question Paper leak case

అమరావతి: నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లెలో జడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి క్వశ్చన్ పేపర్ లీకైన కేసులో 12 మంది పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు రాజేష్ అని తెలిపారు. లీక్ సూత్రధారి రాజేష్ సహా 11 మంది టీచర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ… ఎగ్జామినేషన్ డ్యూటీకి హాజరై మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన ప్రధాన వ్యక్తి టి. రాజేష్ తన మొబైల్ తో ఫోటో తీసి తొమ్మిది మంది తెలుగు టీచర్లకు పంపించాడు. అరెస్ట్ చేసిన వారిలో తెలుగు టీచర్లు నీలకంఠేశ్వర రెడ్డి, నాగరాజు, మధు, వెంకటేశ్వర్లు, దస్తగిరి, వనజాక్షి, లక్ష్మీ దుర్గ, ఆర్యభట్టు, పోతునూరు, రంగనాయకులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. పరీక్ష కేంద్రంలో ఇలాంటి ఘటన జరుగుతున్నా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్, డిపార్టుమెంటల్ ఆఫీసర్, ఫ్లయింగ్ స్క్వాడ్‌కు చెందిన నలుగురిని విధులనుంచి సస్పెండ్ చేశామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News