కీవ్: ఉక్రెయిన్‌లోని విన్నీత్సియా నగరంపై గురువారం రష్యా సేనలు జరిపిన క్షిపణి దాడిలో 12 మంది పౌరులు మరణించగా 25 మంది గాయపడ్డారు. సైనిక బలగాలే లేని నగరంలోని నివాస ప్రాంతాలలో పౌర జనాభాపై రష్యా జరిపిన ఈ దాడిని బహిరంగ ఉగ్రవాద చర్యగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ అభివర్ణించారు. కీవ్‌కు నైరుతి దిశలో ఉన్న విన్నీత్సియా నగరంలోని ఒక కార్యాలయ భవనంపై రష్యా సేనలు మూడు క్షిపణులతో దాడి జరిపాయని, దీని ప్రభావం వల్ల పక్కన ఉన్న నివాస భవనాలు భారీగా దెబ్బతిన్నాయని ఉక్రెయిన్ జాతీయ పోలీసులు తెలిపారు. క్షిపణి దాడి వల్ల ఏర్పడిన మంటలకు పార్కింగ్ లాట్‌లోని 50కి పైగా కార్లు దగ్ధమయ్యాయని వారు చెప్పారు. మృతులలో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు అధ్యక్షుడ జెలెన్‌స్కీ తెలిపారు. పౌరులను భయభ్రాంతులను చేసేందుకే రష్యా సేనలు ఉద్దేశపూర్వకంగా ఈ దాడులు జరిపినట్లు ఆయన అన్నారు.
రష్యా క్షిపణి దాడిలో 12 మంది పౌరులు మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -