Sunday, November 24, 2024

బిజెపి… 12 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ?: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

12 Crore jobs in India asked by Harish
హైదరాబాద్: కూకట్‌పల్లిని అన్ని విధాలా అభివృద్ధి చేశామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. కూకట్ పల్లి నియోజకవర్గం లో నిర్వహించిన హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికల సమావేశం లో యం.యల్.సి ఎన్నికల ఇంచార్జ్ హరీష్ రావు మాట్లాడారు. కూకట్‌పల్లిలో అండర్ బ్రిడ్జీలు, ఫ్లైఓవర్లు ఏర్పాటు చేశామని, రూ.200 కోట్లతో తాగునీటి సమస్యలు తీర్చామని, 24 గంటలు కరెంట్ వస్తుండడంతో మూడు షిప్టుల్లో పరిశ్రమలు నడుస్తున్నాయన్నారు. బిజెపి అధికారంలో ఉన్న పక్క రాష్ట్రం కర్నాటకలో కరెంటు కోతలు, నీటి సమస్యలు ఉన్నాయని వివరించారు. బిజెపి నేతలు దీనికి సమాధానం చెప్పాలని సవాలు విసిరారు. కార్యకర్తలను టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆదుకుంటుందని, బిజెపి నేతలకు దమ్ముంటే… తెలంగాణకు ఐటిఐఆర్, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలని మోడీ ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్ని కేంద్రంలోని బిజెపి సర్కార్ ప్రైవేట్ పరం చేస్తోందని, ఎల్‌ఐసి, రైల్వేలను కేంద్రం ప్రైవేట్‌పరం చేస్తుందని, ప్రైవేట్‌పరం చేస్తే ఎస్‌సి, ఎస్‌టి, బిసిలు నష్టపోతారన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానాలు చేశారని, ఆరేండ్లలో 12 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయాలి? కానీ ఎక్కడ చేశారని మోడీ ప్రభుత్వాన్ని హరీష్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News