Friday, January 24, 2025

రోడ్ల నిర్మాణాలకు రూ .12 కోట్లు మంజూరు

- Advertisement -
- Advertisement -

జన్నారం: జనారం మండలంలోని వివిధ గ్రామాలలో రోడ్ల నిర్మాణాలకు ట్రైబల్ వెల్ఫేర్ నుంచి రూ. 12 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే రేఖానాయక్ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ను ఎమ్మెల్యే రేఖానాయక్‌తో జన్నారం మండలం నాయకులు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సత్యవతిరాథోడ్ రూ. 12 కోట్లు మంజూరు చేస్తూ సంబంధిత ముఖ్య కార్యదర్శికి సిఫార్సు చేయడం జరిగిందని రేఖానాయక్ తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు మంజూరు చేయడానికి సిద్దంగా ఉన్నారని, అభివృద్దే ద్యేయంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. ఆమె వెంట జన్నారం మండల పార్టీ అద్యక్షులు గుర్రం రాజారాంరెడ్డి, వైస్ ఎంపీపీ సుతారి వినయ్‌కుమార్, జన్నారం ఎంపీటీసీ మహ్మద్ రియాజోద్దీన్, రోటిగూడ ఉప సర్పంచ్ బారతపు సత్యనారాయణ, నాయకులు మల్క లక్ష్మణ్‌లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News