Monday, December 23, 2024

ఫిబ్రవరిలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఫిబ్రవరి నెలలో ఏమైనా ముఖ్యమైన బ్యాంకు పనులు ఉన్నాయా? అయితే గమనిక. బ్యాంకుకు వెళ్లే ముందు ఏఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకుంటే మంచిది. బ్యాంకుల్లో ఏదైనా పని ఉంటే సెలవు రోజులకు అనుగుణంగా ముందుగానే ప్లాన్​ చేసుకోవడం ఉత్తమం. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు మొత్తం 12 రోజులు సెలవులు వస్తున్నాయి. ఈ నెలలో బ్యాంకులకు ఈ క్రింది రోజుల్లో సెలవులు రానున్నయి.

ఫిబ్రవరి బ్యాంక్​ హాలిడేస్ జాబితా:

ఫిబ్రవరి 2: సోనమ్ లోచర్​ (గ్యాంగ్​టాక్​లో బ్యాకులకు సెలవు)

ఫిబ్రవరి 5: సరస్వతి పూజా, శ్రీ పంచమి, వసంత పంచమి(కోల్​కతా, భువనేశ్వర్​, అగర్తలలో బ్యాకులకు సెలవు)

ఫిబ్రవరి 6: ఆదివారం సాధారణ సెలవు

ఫిబ్రవరి 12: రెండో శనివారం సాధారణ సెలవు

ఫిబ్రవరి 13: ఆదివారం సాధారణ సెలవు

ఫిబ్రవరి 15: మహమ్మద్ హజ్రత్ అలీ జయంతి, లుయిస్​-నాగాయ్​-ని (ఇంఫల్​, కాన్​పూర్​, లక్నోల్లో బ్యాంకులకు సెలవు)

ఫిబ్రవరి 16: గురు రవిదాస్​ జయంతి(చంఢీగడ్​లో బ్యాకులకు సెలవు)

ఫిబ్రవరి 18: దోల్​జాత్రా​ (కోల్​కతాలో బ్యాంకులకు సెలవు)

ఫిబ్రవరి 19: ఛత్రపతి శివాజీ మహారాజ్​ జయంతి (మహారాష్ట్రలో బ్యాంకులకు సెలవు)

ఫిబ్రవరి 20: ఆదివారం సాధారణ సెలవు

ఫిబ్రవరి 26: నాలుగో శనివారం సాధారణ సెలవు

ఫిబ్రవరి 27: ఆదివారం సాధారణ సెలవు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News