రైలు ఢీకొని 12మంది మృతి , పలువురికి తీవ్ర గాయాలు రైలులో
మంటలు అంటుకున్నాయన్న వదంతులతో చైన్ లాగి రైలు నుంచి
దూకిన ప్రయాణికులు పక్క ట్రాక్‌లో వెళ్తున్న రైలు కింద పడి దుర్మరణం
జలగావ్(మహారాష్ట్ర): మహారాష్ట్రలో ఘోరరైలు ప్రమాదం జరిగింది. 12 మంది ప్రయాణి కులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ల క్నో ముంబై పుష్పక్ ఎక్స్ ప్రెస్ మహారాష్ట్రలోని జలగావ్ వెళ్తుండగా రైలులో మంటలు అం టు కున్నాయనే వదంతులు వ్యాపించి ప్రయా ణి కులు భయాందోళనలకు గురయ్యారు. ఎవరో చైన్ లాగి, రైలును ఆపారు. ఈ లోగానే కొంద రు వేగంగా నడుస్తున్న రైలు నుంచి కిందకు దూ కారు. అదే సమయంలో ఒకరిని మరొకరు ఢీకొ న్నారు. పక్క ట్రాక్‌లో నుంచి వెళ్తున్న మరో రైలు కింద పడి పలువురు మృతి చెందారు. ఈ ఘ టనలో 12 మంది ప్రయాణికులు మరణించా రని, పలువురు గాయపడ్డారని జలగావ్ ఎస్పీ తెలిపారు. ముంబైకి 400 కిలోమీటర్ల దూరంలో పచోరీ సమీపంలో మహేజి – పర్దాడే స్టేషన్ల మ ధ్య ఈ దుర్ఘటన జరిగింది. పుష్పక్ ఎక్స్ ప్రెస్ ల క్నో -ముంబై మధ్య ఏకైక సూపర్ ఫాస్ట్ రైలు. సా యంత్రం 5 గంటల ప్రాంతంలో రైలులో మం టలు అంటుకున్నాయంటూ ఎవరో చైన్ గుం జడంతో రైలు ఆగింది. ఒక్కసారిగా పుష్పక్ ఎక్స్‌ప్రెస్ ఆగడంతో కిందకి దుమికిన కొం దరు ప్రయాణికులు మరో మార్గంలో ప్రయాణి స్తున్న కర్ణాటక ఎక్స్ ప్రెస్ కిందపడి చనిపోయా రని సెంట్రల్ రైల్వే ప్రతినిధి తెలిపారు. ఆ రైలు బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తోంది.పుష్పక్ ఎక్స్ ప్రెస్‌లోని ఒక కోచ్‌లో ’హాట్ యాక్సిల్’ లేదా’ బ్రేక్-బైండింగ్’ కారణంగా నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి.
దాంతో కొందరు ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. వారు గొలుసు లాగారు, కొందరు పట్టాలపైకి దూకారు. అదే సమయంలో కర్నాటక ఎక్స్‌ప్రెస్ పక్కనే ఉన్న ట్రాక్‌పై వెళుతోందని, ఫలితంగా పుష్పక్ రైలు నుంచి దుమికి వారిలో కొందరు చనిపోయారని రైల్వే అధికారి తెలిపారు. ప్రమాదం వార్త తెలియడంతో భుసావల్ నుంచి సహాయానికి రిలీఫ్ టైన్ ను పంపారు. గాయపడిన వారు అందరికీ వైద్యసహాయం అందించేందుకు యత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. జిల్లాయంత్రాంగంతో మాట్లాడి అన్ని సహాయ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తన కేబినెట్ మంత్రి గిరిశ్ మహాజన్ ను ఎస్పీని, జిల్లా కలెక్టర్ ను అక్కడికి పంపి సహాయ కార్యక్రమాలు తక్షణం చేపట్టేలా ఆదేశించారు. మరో మంత్రి గులాబ్ రావ్ పాటిల్ ఇప్పటికే జలగావ్ వెళ్లారు. ప్రమాద స్థలంలో పరిస్థితి దారుణంగా ఉంది. పట్టాలపై శవాలు రక్తం ఓడుతూ పడి ఉన్నాయి. తెగిన అవయవాలతో అక్కడి దృశ్యాలు కలచి వేస్తున్నాయి.