Monday, December 23, 2024

బ్రిడ్జి పైనుంచి పడిన బస్సు: 12 మంది మృతి

- Advertisement -
- Advertisement -

 

భోపాల్: మధ్య ప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లాలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఖల్‌ఘట్ సంజయ్ సేతూ బ్రిడ్జి పైనుంచి బస్సు పడిపోవడంతో 12 మంది దుర్మరణం చెందారు. పోలీసులు, స్థానికులు 15 మందిని కాపాడారు. మహారాష్ట్రాకు చెందిన బస్సు 32 మంది ప్రయాణికులతో ఇండోర్ నుంచి పుణే వెళ్తుండగా వాహనం అదుపుతప్పి బ్రిడ్జి పైనుంచి నీళ్లలో పడిపోయింది. స్థానికుల సమాచారం మేరకు ధమ్‌నోడ్, ఖల్టాకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ధమ్‌నోడ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News