- Advertisement -
వాయవ్య, మధ్య భారత్‌లో సూర్యుడి భగభగలు తీవ్రస్థాయికి చేరాయి. పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌ల్లో ఉష్ణోగ్రతలు 49 డిగ్రీలు దాటాయి. ఈ నెలాఖరు వరకూ ఇవే పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ (ఐఎండి ) శుక్రవారం తెలిపింది. శుక్రవారం రాజస్థాన్‌లోని ఫహ్లోడిలో ఉష్ణోగ్రత 49.6 డిగ్రీలకు చేరుకుంది. పశ్చిమ యుపి, మధ్యప్రదేశ్ , చండీగఢ్‌ల్లో వారం రోజుల పాటు ఇదే వేడి సాగుతుందని పేర్కొంటూ ఐఎండి శుక్రవారం రెడ్ వార్నింగ్ వెలువరించింది. తీవ్రస్థాయి వడగాడ్పులతో రాజస్థాన్‌లో ఆరుగురు డస్సిపోయి మృతి చెందారని వెల్లడైంది. దీనితో ఈవారంలో ఎండదెబ్బలకు రాజస్థాన్‌లో మృతుల సంఖ్య 12కు చేరుకుంది. కాగా తీవ్రస్థాయి ఎండల నడుమనే శనివారం ఈ ప్రాంతాలలో 6వ విడత పోలింగ్ ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం అయింది.
- Advertisement -