Thursday, January 23, 2025

వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట: 12 మంది మృతి

- Advertisement -
- Advertisement -

12 dead in stampede at Vaishno Devi shrine

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరగడంతో 12 మంది భక్తులు చనిపోయారు. ఈ ఘటనలో మరో 13 మంది త్రీవంగా గాయపడ్డారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున 2.45 నిమిషాలకు జరిగింది. కొత్త సంవత్సరం సందర్భంగా ఆలయానికి భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగిందని స్థానిక పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు పంజాబ్, జమ్ము కశ్మీర్, హర్యానాకు చెందిన వారిగా గుర్తించామని పోలీసులు వెల్లడించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News