మోరెనా/భోపాల్: మధ్యప్రదేశ్ మోరెనా జిల్లాలో 12 మంది మృతి చెందగా.. ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత మూడు నెలల్లో ఇలాంటి దుర్ఘటన జరగడం ఇది రెండోసారి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. మోరెనా జిల్లా మన్‌పూర్, పహవాలీ గ్రామాలకు చెందిన కొందరు సోమవారం రాత్రి తెల్లని రంగు కలిగిన లిక్కర్ తాగారు. దీంతో 12 మంది మృతి చెందారని, ఏడుగురు అస్వస్థులయ్యారని డిఐజి రాజేష్ హింగాంకర్ పాత్రికేయులకు వివరించారు. ఈ దుర్ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, ఈమేరకు కొంతమందిని అదుపులో తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు. తీవ్ర అస్వస్తులైన వారిని గ్వాలియర్ ఆస్పత్రిలో చేర్చారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇది అత్యంత విషాదకర సంఘటనని విచారం వెలిబుచ్చారు. నిర్లక్షం వహించిన మోరెనా జిల్లా ఎక్సయిజ్ ఆఫీసర్ ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. గత ఏడాది అక్టోబర్‌లో ఉజ్జయిన్‌లో కల్తీ లిక్కర్ తాగి 14మంది మృతి చెందారు. సంబంధిత పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి కూడా సస్పెండ్ అయినట్టు రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు.
12 died due to Spurious liquor in Madhya Pradesh