Tuesday, April 22, 2025

ముంచిన వాన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో
భారీ వర్షాలు భాగ్యనగరంలోనే 21
ప్రాంతాల్లో నేలకొరిగిన భారీ వృక్షాలు
అనేక ప్రాంతాల్లో పేలిన ట్రాన్స్‌ఫార్మర్లు
భారీ సంఖ్యలో ట్రిప్ అయిన ఫీడర్లు
విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం
పలు చోట్ల రోడ్లపై నిలిచిన వరద నీరు..
ట్రాఫిక్ జామ్ జనగామ జిల్లా
బచ్చన్నపేట మండలం ఆలింపురంలో
పిడుగు పడి 12 మంది రైతులకు
గాయాలు…ఇద్దరి పరిస్థితి
విషమం కామారెడ్డి మండలంలో
పిడుగు పడి 40 గొర్రెలు మృతి
షాబాద్ వద్ద చెట్టు విరిగిపడి ఇద్దరికి
గాయాలు కొనుగోలు కేంద్రాల్లో
తడిసి ముద్ద్దయిన ధాన్యం ఈదురు
గాలులకు నేలరాలిన అరటి,
బొప్పాయి, మొక్కజొన్న పంటలు
అప్రమత్తంగా ఉండాలి : మంత్రి పొన్నం

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలుగురాష్ట్రాల్లో శుక్రవా రం భారీ వర్షాలు కురిశాయి. అకాల వర్షాలతో పలుచో ట్ల పిడుగులుపడి పలువురు గాయపడ్డారు. అలాగే కోతకొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. పలు జిల్లాల్లో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. అధిక ఉష్ణోగ్రతలు న మోదవుతున్న నేపధ్యంలో అదేరీతిలో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నా యి. హైదరాబాద్ జంటనగరాలు, రంగారెడ్డి, సిద్దిపేట, మహబూబ్ నగర్, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట,ఆదిలాబాద్,నిర్మల్, కామారెడ్డి, నిజమాబాద్, మెదక్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల వడగళ్ళ వానలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో
ధాన్యం వర్షం నీటికి కొట్టుకుపోయింది.లా చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడ్డాయి.

ఈదురు గాలులతో పంటపొలాల్లో చెట్లు నేలకూలాయి. చేతికొచ్చిన పంట రాలిపోయింది. పలు ప్రాంతాల్లో మామిడి నేలరాలింది. హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో చెట్లు విరిగిపడడంతో పలు చోట్ల విద్యుత్తుకు, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రధానంగా జంటనగరాల్లో 21 ప్రాంతాలలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. అత్యధికంగా నాగోలు బండ్లగూడ ప్రాంతంలో అత్యధికంగా 8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. సగటున హైదరాబాద్ నగరంలో 5 సెంటిమీటర్ల వర్షపాతం పడింది. తీవ్రగాలిదుమారం కారణంగా సుమారు డ్బ్బై విద్యుత్ ఫీడర్లు దెబ్బతిన్నాయి. చాలా చోట్ల విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు(డిటిఆర్) వద్ద మంటలు చెలరేగాయి. ఉస్మాన్‌నగర్ తెల్లాపూర్ వద్ద బ్యానర్ విద్యుత్ తీగలపై పడడంతో విద్యుత్ సిబ్బంది వెంటనే తొలగించారు. కాచిగూడలోని డి మార్ట్ సమీపంలో పురాతన వృక్షం రోడ్డుపై కూలిపోయింది. ఆసమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడతో ప్రమాదం తప్పింది. ట్రాఫిక్ అంతరాయం కలిగింది.రంగారెడ్డి జిల్లా శంషాబాద్ నుంచి షాబాద్‌కు వెళ్లే మార్గంలో చెట్టు కూలి మోటారు సైకిల్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు

. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఈదురుగాలులకు పశువుల షెడ్లు ధ్వంసంఅయ్యాయి. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం పరిధిలో ఒక్కసారిగా భారీ ఈదురుగాలులు, వర్షం కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. రైతుల ధాన్యం కుప్పలు వర్షం నీటికి కొట్టుకుపోయాయి. అక్కన్నపేట మండలంలో కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. కొన్ని గ్రామాల్లో కొతకొచ్చిన వరిపంట వడగళ్ల వానతో నేలరాలిపోయింది. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కొత్లాపూర్ గ్రామంలో ఈదురుగాలులకు అరటి, బొప్పాయి, మొక్కజొన్న, ఉల్లిగడ్డ, మామిడి పంటలు నేలమట్టం అయ్యాయి. పెద్దేముల్, తాండూరు మండలాల్లో వడగళ్ల వానకు పంటనేలరాలిపోవడంతో రైతన్నలు ఆందోళనకు గురయ్యారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం అలీంపురం గ్రామంలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రంలో 12 మంది రైతులు గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా గాలిదుమారంతో వర్షం కురియడంతో రైతులు తమ వడ్లకుప్పలపై పరదాలు కప్పే క్రమంలో ఒక్కసారిగా పిడుగు పడింది. వెంటనే వారికి 108 అంబులెన్సులో జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

వారిలో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉందని గ్రామస్తులు తెలిపారు.రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి, రాజుపేట గ్రామాల్లో కొనుగోలు లకేంద్రంలోని వరి ధాన్యం తడిసి ముద్దయింది. నర్మాల గ్రామంలో అనిల్‌రావు రైస్ మిల్ సమీపంలో భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.కామారెడ్డి మండలం ఇస్రోజివాడి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం పిడుగుపాటుకు 40 గొర్రెలు మృతిచెందాయి. గ్రామానికి చెందిన కడారి దేవయ్య గొర్రెలను మేతకు తీసుకువెళ్లగా ఒక్కసారిగా ఉరుములతో కూడిన పిడుగు గొర్రెల మందపై పడడంతో నలబై గొర్రెలు అక్కడిక్కడే మరణించాయి. దీంతో సుమారు రూ.5లక్షల మేరకు నష్టం వాటిల్లినట్లు బాదితుడు, గ్రామస్తులు తెలిపారు. కామారెడ్డి జిల్లా బిబిపేట మండలంలో ఈదురుగాలులతో పశువుల షెడ్లు, కోళ్లఫారాల రేకులు గాలితీవ్రతకు ఎగిరిపోయాయి. రాజపేట మండలంలో ఈదురుగాలులకు ఇంటిపైకప్పులు ఎగిరిపోయాయి. ఎల్లారెడ్డిపల్లి తాండలో పూరిగుడిసెల పైకప్పులు లేచిపోయి ముగ్గురు గాయపడగా గ్రామస్తులు వారిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News