Monday, December 23, 2024

అగుంబే అడవుల్లో 12 అడుగుల నాగరాజు

- Advertisement -
- Advertisement -

కర్నాటకలోని పశ్చిమ కనుమల అగుంబే అటవీ ప్రాంతంలో 12 అడుగుల నాగు పాము కలకలం రేపింది. దీనిని పాములు పట్టే వారు వచ్చి పట్టుకుని సమీపంలోని అడవుల్లోకి భద్రంగా వదిలిపెట్టారు. ఈ భారీ పాము వీడియోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఈ ప్రాంతంలోని ఓ ఇంటి ఆవరణలోని పొదలలో కొద్ది సేపు ఉన్న తరువాత ఈ పాము ప్రధాన రాదారి మీదుగా వెళ్లుతుండగా స్థానికులు గమనించారు. దీని గురించి వెంటనే అటవీశాఖాధికారులకు తెలిపారు. ఈ సమాచారాన్ని తెలుసుకున్న అగుంబే అటవీ పరిశోధనా కేంద్రం క్షేత్రస్థాయి అధికారి అజయ్ గిరి తమ బృందంతో అక్కడికి వచ్చారు.

పాములు పట్టే వారిని పిలిపించడంతో వారు దీనిని అతి చాకచక్యంగా పట్టుకున్నారని , తరువాత దట్టమైన అడవుల్లో వదిలిపెట్టారని అజయ్ వివరించారు. ఈ భారీ నాగుపాము జరజర పాకుతూ ఉండటం, బుసలు కొడుతున్నప్పటి దృశ్యాలను భారత అటవీ శాఖ అధికారి సుశాంత నందా తమ ఎక్స్ సామాజిక మాధ్యమంలో పెట్టారు. మనిషి ఎత్తును మించి ఉండే ఈ కింగ్ కోబ్రాలు ఒక్కోసారి ఉవ్వెత్తున లేచి ఎదురుగా ఉండే వారి కళ్లలోకి చూస్తుంటాయి. ఇది చిమ్మే ఒక్క బొట్టు విషం కనీసం పది మంది ప్రాణాలు తీయగలదని నిపుణులు తెలిపారు. ఈ పాము రాజరికపు దర్పంతో నిజంగా నాగరాజు అని నెటిజన్లు వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News