Wednesday, January 22, 2025

బ్రిటన్‌లో 12 మంది భారతీయుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

లండన్: వీసా నిబంధనలను ఉల్లంఘించి బెడ్డింగ్, కేక్ ఫ్యాక్టరీలో అక్రమంగా పనిచేస్తున్నారన్న అనుమానంపై వరుస దాడులు నిర్వహించిన బ్రిటన్‌కు చెందిన ఇమిగ్రేషన్ అధికారులు ఒక మహిళతోసహా 12 మంది భారతీయులను అరెస్టు చేశారు. చట్ట విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని నిఘా సంస్థల నుంచి వచ్చిన సమాచారం మేరకు ఇంగ్లండ్‌కు చెందిన వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ ప్రాంతంలోని ఒక బెడ్డింగ్, మ్యాట్రెస్ ఫ్యాక్టరీపై ఇమిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బుధవారం దాడులు నిర్వహంచినట్లు బ్రిటక్ అంతరంగిక వ్యవహారాల(హోం) శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

చట్ట విరుద్ధంగా పని చేస్తున్నారన్న అనుమానంపై ఏడుగురు భారతీయులను అరెస్టు చేసినట్లు తెలిపింది. సమీపంలోని ఒక కేక్ ఫ్యాక్టరీలో వీసా నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న మరో నలుగురు భారతీయులను అధికారులు అరెస్టు చేశారని తెలిపింది. ఒక ప్రైవేట్ హోంలో వీసా నిబంధనలను ఉల్లంఘిస్తూ పనిచేస్తున్న ఒక మహిళను కూడా అధికారులు అరెస్టు చేశారని, దాడులు కొనసాగుతున్నాయని హోం శాఖ తెలిపింది. వీరిలో నలుగురిని ఇమిగ్రేషన్ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారని, వారిని భారత్‌కు వాపసు పంపే విషయం పరిశీలనలో ఉందని ప్రకటనలో తెలిపారు.

హోం ఆఫీసుకు నిత్యం హాజరయ్యే షరతుపై మిగిలిన 8 మందిని బెయిల్‌పై విడుదల చేసినట్లు ప్రకటన తెలిపింది. తమ ఫ్యాక్టరీలలో చట్ట వ్యతిరేకంగా కార్మికులను నియమించుకున్నందుకు ఆ రెండు ఫ్యాక్టరీలు భారీ జరిమానా కట్టాల్సి ఉంటుందని హోం శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఇమిగ్రేషన్ నిబంధనల అమలును తనిఖీ చేయడానికి చర్యలు చేపట్టినట్లు బ్రిటన్ మంత్రి మైఖేల్ టామ్లిన్‌సన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News