Sunday, December 22, 2024

మినీ బస్సు బోల్తా: 12 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

12 injured as minibus overturns in Anantapur

అమరావతి: అనంతపురం జిల్లాలోని నల్లమాడ మండలం పులగంపల్లి వద్ద ఆదివారం మినీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో పన్నెండు మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతులు పులగంపల్లికి చెందిన చలపతి, ఈశ్వరమ్మ, గోవాదమ్మగా గుర్తించారు. తిరుమల వెళ్లి పులగంపల్లికి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మినీ బస్సులో 25 మంది కుటుంబసభ్యులు తిరుమల వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కదిరిలో 10 మంది కుటుంబీకులు దిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News