Saturday, December 28, 2024

కొలంబియాలో కాల్పులు.. 12 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

12 injured in Shooting in Colombia

కొలంబియా (సౌత్ కరోలినా): అమెరికా కొలంబియా లోని దక్షిణ కరోలినా రాజధానిలో ఓ షాపింగ్ మాల్‌లో శనివారం మధ్యాహ్నం దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో 12 మంది గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. షాపింగ్ మాల్ లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారని చెప్పారు. ఆయుధాలు కలిగి ఉన్న ముగ్గురిని అదుపు లోకి తీసుకున్నామని వీరిలో ఒకరైనా కాల్పులకు సాహసించి ఉంటారని భావిస్తున్నామని కొలంబియా పోలీస్ చీఫ్ హోల్‌బ్రూక్ వెల్లడించారు. కాల్పుల్లో గాయపడ్డ వారిని వెంటనే ఆస్పత్రికి తరలించామని, బాధితులంతా 15 నుంచి 73 ఏళ్ల మధ్య వయస్కులని తెలిపారు. ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగినట్టు భావిస్తున్నారు. గతవారం న్యూయార్క్ లోని ఓ స్కూల్ వెలుపల జరిగిన కాల్పుల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. కాల్పుల్లో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News