Sunday, December 22, 2024

రాజస్థాన్‌లో బస్సు ప్రమాదం..12 మంది మృతి

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్‌లో సికర్ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఒక ప్రైవేట్ బస్సు ఫ్లైఓవర్ గోడను ఢీకొన్న ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు మరణించగా మరో 30 మంది గాయపడ్డారు. లక్ష్మణ్‌గఢ్ వద్ద మలుపు తిరుగుతున్న సమయంలో ప్రైవేట్ బస్సు ఫ్లైఓవర్ గోడను ఢీకొన్నట్లు జిల్లా ఎస్‌పి భువన్ భూషణ్ యాదవ్ తెలిపారు. బస్సు సలసర్ నుంచి వస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రయాణికులతో నిండుగా ఉండడంతోపాటు ఓవర్ స్పీడు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ఆయన తెలిపారు. ఫ్లైఓవర్ గోడను వేగంగా ఢీకొనడంతో బస్సు కుడివైపు భాగం నుజ్జునుజ్జయిందని ఆయన చెప్పారు. బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా బస్సులో చిక్కుకుపోయిన ప్రయాణికులను బయటకు తెచ్చేందుకు క్రేన్ సహాయాన్ని పోలీసులు తీసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News