Sunday, January 19, 2025

సోమాలియా హోటల్‌పై ఉగ్రదాడి: 12మంది మృతి

- Advertisement -
- Advertisement -

మొగదిషు(సోమాలియా): సోమాలియా రాజధాని మొగదిషులో ఓ హోటల్‌పై శుక్రవారం సాయంత్రం ఆల్‌ఖైదాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు దాడి చేయడంతో 12 మంది మృతి చెందారు. హయత్ హోటల్ లోకి చొరబడి కాల్పులు జరపడానికి ముందు రెండు కారు బాంబులు పేల్చారు. సోమాలియా లోని అల్ షబాద్ తిరుగుబాటుదారులు ఈ దాడికి బాధ్యత ప్రకటించారు. భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని కాల్పులు జరిపాయి. ఆపరేషన్ ఇంకా కొససాగుతోందని దాదాపు ముగింపు దశకు చేరుకుందని అధికారులు తెలిపారు. శనివారం ఉదయం వరకు రాజధానిలో కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఉగ్రవాదుల చెర నుంచి హోటల్‌ను స్వాధీనం చేసుకోడానికి ప్రభుత్వ బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఉగ్రవాదుల దాడిలో హోటల్ చాలావరకు ధ్వంసమైంది. సోమాలియా అధ్యక్షునిగా ఈ ఏడాది మేలో హసన్ షేక్ మహముద్ బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన మొదటి దాడి ఇదే. ఈ ఘటనకు బాధ్యత వహించిన షాబాద్ గ్రూప్ సోమాలియా ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారం లోకి రావాలని పదేళ్లుగా ప్రయత్నిస్తోంది. హయత్ హోటల్‌లో ఎక్కువగా చట్ట సభ్యులు, ప్రభుత్వ అధికారులు బస చేస్తుంటారు.

12 Killed after Terror Attack on Somalia Hotel

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News