Monday, January 20, 2025

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం: 12 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Road accident in Kullu district

Kullu accident 2

జాంగ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని కుల్లూ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అందులో 12 మంది చనిపోయారు. ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ప్రయివేట్ బస్సు ప్రమాదం అనేక కుటుంబాలకు జీవితాంతం బాధను వదిలిపెట్టింది. కుల్లూ జిల్లాలోని నియోలి-షంషేర్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. జాంగ్లా గ్రామం వద్ద సోమవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో బస్సు కొండ మీది నుంచి లోయలోకి పడిపోయిందని సమాచారం. రెస్కూ టీమ్ అక్కడికి చేరుకుని గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించింది. కాగా ముఖ్యమంత్రి సహా, కుల్లూ డిప్యూటీ కమిషనర్ అశుతోష్ గార్గ్, సీనియర్ అధికారులు ఘటనాస్థలికి చేరి పరామర్శించారు. ఈ ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News