- Advertisement -
పాట్నా: ట్రక్కు అదుపుతప్పి భక్తుల పైకి దూసుకెళ్లడంతో 12 మంది మృతి చెందిన సంఘటన బిహార్ రాష్ట్రం వైశాలి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మెహ్నార్ గ్రామంలో దేవత విగ్రహాల ఊరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో 12 మంది ఘటనా స్థలంలోనే చనిపోయారు. మృతులలో ఏడుగురు పిల్లలు ఉన్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై రాష్ట్రపతి దౌపది ముర్మూ, ప్రధాని నరేంద్ర మోడీ, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతులు కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తరపున రెండు లక్షల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రకటించాయి. క్షతగాత్రులకు యాబై వేల రూపాయలు ఇస్తామని తెలిపాయి.
- Advertisement -