Sunday, January 19, 2025

మడగాస్కర్ క్రీడలపోటీల్లో తొక్కిసలాట..12 మంది మృతి

- Advertisement -
- Advertisement -

అంటననారివో : ద్వీపదేశమైన మడగాస్కర్ రాజధాని అంటననారివోలో క్రీడల పోటీల సందర్భంగా స్టేడియంలో తొక్కిసలాట జరిగి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 80 మంది వరకు గాయపడ్డారు. వీరిలో 11 మంది పరిస్థితి క్లిష్టంగా ఉందని ప్రధాని క్రిస్టియన్ ఎన్టే తెలిపారు. శుక్రవారం ఈ సంఘటన జరిగింది. 11 వ ఇండియన్ ఓసియన్ క్రీడల పోటీలను అంటననారివోలో ప్రారంభించగా, 50 వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. దీంతో స్టేడియం ముఖద్వారం వద్ద తొక్కిసలాట జరిగింది. అనేక మంది కింద పడి గాయాల పాలయ్యారు. మహామసీనా స్టేడియంలో జరిగిన సంతాప కార్యక్రమంలో మృతులకు సంతాపం తెలపడానికి కొన్ని నిమిషాలు మౌనం పాటించాలని ప్రేక్షకులను మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలీనా కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News