Thursday, January 23, 2025

రాబందుల చేతుల్లో పెట్టొద్దు

- Advertisement -
- Advertisement -

పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల్లో తొమ్మిదేళ్లలో ఎంతో అభివృద్ధి చేశారని బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుం ట్ల తారాకరామారావు అన్నారు. కాంగ్రెస్, బిజెపిలు చేతగాని దద్ద మ్మ పార్టీలని, ఆ పార్టీ నాయకులవి ప్రజలకు మేలు చేసే ముఖాలు కావని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు పొరపాటున కూడా రాబందుల చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టే ప్రయత్నం చేయవద్దని సూచించారు. వరంగల్ నగరంలో శనివారం
గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 12లక్షల మందికి ఆడపడుచులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా రూ.లక్ష116ల చొప్పున అందజేశామని,

13లక్షల మంది బాలింతలకు కెసిఆర్ కిట్లు అందించామని తెలిపారు. ఒకప్పుడు రూ.400ల ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను మోడీ ప్రభుత్వం రూ.1200లకు పెంచిందని చెప్పారు. రూ.400కే నాడు గగ్గోలు పెట్టిన బిజెపి నేతలు నేడు ప్రజలకు ఏం చెబుతారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ దివాలాకోరు ఆర్థిక విధానాలు, పనికిమాలిన చర్యల వలన రాష్ట్ర ప్రజలు అదోగతి పాలవుతున్నారని, పెద్దనోట్ల రద్దీతో ఏం సాధించారని, స్విస్ బ్యాంకుల్లోని నల్ల ధనాన్ని వెలికితీసింది ఎంత అని మోడీ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌పై అవాకులు, చెవాకులు పేలుతున్న పిసిసి అధ్యక్షుడి తీరును మంత్రి కేటీఆర్ తీవ్రంగా దుయ్యబట్టారు. 55ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలను రాబందుల్లా పీల్చుకుతిన్నారని తీవ్రంగా విమర్శించారు.

చేతికాని, దద్దమ్మ పార్టీలని కాంగ్రెస్, బిజెపి ఉచ్చులో పొరపాటున కూడా పడొద్దన్నారు. బిజెపి నాయకత్వానికి, మోడీ ప్రభుత్వానికి వరంగల్ గడ్డ నుంచే గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తొమ్మిదేళ్లు ప్రజల కోసం పని చేసిన బిఆర్‌ఎస్ పార్టీకి మరో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆలోచించి ఓటు వేయాలని, పొరపాటు పడితే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ప్రజలు ఆగమైపోతారని అన్నారు. వరంగల్ నగరంపై ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ప్రత్యేక అభిమానం ఉందని, నిధుల విషయంలోనూ, పదవుల పంపకాల్లో పెద్ద పీట వేస్తున్నారని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ నన్నపునేని నరేందర్‌ను మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రజల హర్షధ్వానాల మధ్య కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్, మహబూబాబాద్ ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, ఎంఎల్‌ఎలు నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఆరూరి రమేశ్, టి.రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, శంకర్‌నాయక్, ఎంఎల్‌సి బస్వరాజు సారయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, కలెక్టర్లు పి.ప్రావిణ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News