- Advertisement -
అబ్దుల్లాపూర్ మెట్ : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్ మెట్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని లష్కర్ గూడ సమీపం లో ఒక ఫామ్ హౌజ్ లో అర్థ రాత్రి పార్టీ జరుగుతుండగా పోలీసులు దాడులు నిర్వహించారు. సుమారు ఆరుగురు అమ్మాయిలు, ఆరుగురు యువకులు ఉన్నట్లు సమాచారం. ఘటన స్థలంలో హుక్కా పాట్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీని వనస్థలిపురానికి చెందిన ఒక మహిళ ఆర్గనైజ్ చేస్తున్నట్లు సమాచారం. అబ్దుల్లా పూర్ మెట్ పోలీసులు ఇప్పటికి బయటకి పొక్కకుండా సమాచారాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు.
- Advertisement -