Sunday, September 8, 2024

కేదార్‌నాథ్ మార్గంలో విరిగిపడిన కొండచరియలు: 12 మంది గల్లంతు

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో గౌరీకుండ్ పోస్ట్ వంతెన సమీపంలో భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగి రెండు దుకాణాలపై పడడంతో 12 మంది గల్లంతయ్యారు. అనేక మంది కొండ చకియల కింద యికు్గుకకుని ుండవచవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గల్లంతైన వారి కోసం ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.

గౌరీకుండ్ వద్ద ఉన్న డాక్ కల్వర్ట్ సమీపంలోని రెండు దుకాణాలపై భారీ కొండ రచియలు విరిగిపడినట్లు ఇజల్లా విపత్తు నివారణ అధికారి నందన్ సిగ్ రాజ్వర్ తెలిపారు. ఆ దుకాణాలపై పనిచేస్తున్న దాదాపు 12 మంది సిబ్బంది గల్లంతైనట్లు ఆయన చెప్పారు. ఎడతెరపిలేకుండా వర్షాల వల్ల కొండ చరియలు విరిగిపడుతుందడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతున్నట్లు ఆయన తెలిపారు. గల్లంతైన వారిలో అత్యధికులు నేపాల్‌కు చెందినవారని ఆయన చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News