న్యూఢిల్లీ : భారత్‌కు దక్షిణాఫ్రికా నుంచి ఒకేసారి 12 చీతా పులులు ఈ నెల 18వ తేదీన (శనివారం) తరలివస్తున్నాయని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ గురువారం తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్ 17న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మచ్చలతో కూడిన ఎనిమిది చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ అభయారణ్యంలోకి లాంఛనంగా వదిలారు.
ఇప్పుడు చీతాల రెండో దశలో భాగంగా 18న మరో 12 చీతాలు రానున్నాయి. వీటిని భారతీయ వాయుదళానికి చెందిన సి17 ప్రత్యేక విమానం ద్వారా ఇండియాకు తీసుకువస్తారు. ఇందుకోసం ఇప్పుడు ఈ విమానం దక్షిణాఫ్రికాకు బయలుదేరి వెళ్లింది. వీటిని కూడా కునో పార్క్‌లోనే వదులుతారు. ఇందుకోసం వీటికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారని మంత్రి వివరించారు.
The 8 cheetahs who came to India in September 2022, under the ambitious and visionary planning of PM Shri @narendramodi ji, have adapted well.
India is now ready to welcome 12 more cheetahs from South Africa. #ProPlanetPeople pic.twitter.com/kGYam8oGDk
— Bhupender Yadav (@byadavbjp) February 16, 2023