Thursday, November 21, 2024

శ్రీలంక అరెస్టులో 12 మంది మత్సకారులు..విడిపించాలని స్టాలిన్ వినతి

- Advertisement -
- Advertisement -

శ్రీలంక నేవీ అరెస్ట్ చేసిన 12 మంది నాగపట్నం మత్సకారులను విడిపించడానికి దౌత్యపరంగా జోక్యం చేసుకోవాలని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ అభ్యర్థించారు. ఈ ఏడాది ఇంతవరకు ఇలాంటి సంఘటనలు 30 వరకు జరిగాయని, మొత్తం 140 మంది మత్సకారులను అరెస్ట్ చేశారని, 200 బోట్లు ప్రస్తుతం శ్రీలంక నేవీ అధీనంలో ఉన్నాయని పేర్కొన్నారు. ఇటీవల రామేశ్వరానికి చెందిన 16 మంది మత్సకారులను శ్రీలంక అధికారులు అరెస్టు చేశారు.

రామేశ్వరం నుంచి బయలు దేరిన 400 మందిలో వీరు ఉన్నారు. అంతర్జాతీయ సాగర జలాలను దాటుతున్నారన్న కారణంపై వీరిని అరెస్టు చేశారు. వీరి బోట్లను స్వాధీనం చేసుకుని మయిలట్టి ఫిషింగ్ పోర్టుకు తరలించారు. అక్కడ జాఫ్నా ఫిషింగ్ డిపార్టుమెంట్‌కు ఈ బోట్లు అప్పగించారు. ఈ అరెస్టులు, బోట్ల స్వాధీనం సంఘటనలతో తమిళనాడు కోస్తా సమాజ భద్రతకు, జీవనానికి ముప్పు ఏర్పడుతోందని, తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకుని వారిని విడిపించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్టాలిన్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News