న్యూఢిల్లీ: గత పార్లమెంట్ సమావేశాల్లో దురుసుగా వ్యవహరించినందుకు 12 మంది ప్రతిపక్ష రాజ్యసభ సభ్యులను ప్రస్తుత శీతాకాల సమావేశాలు పూర్తయ్యేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు రాజ్యసభ డిప్యుటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ సోమవారం తెలియచేశారు. సస్పెన్షన్ వేటు పడిన రాజ్యసభ సభ్యులలో కాంగ్రెస్ ఎంపి ఛాయా వర్మ, శివసేన ఎంపి ప్రియాంక చతుర్వేది, టిఎంసి ఎంపి డోలా సేన్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎంపీలు, టిఎంసి, శివసేనకు చెందిన ఇద్దరేసి సభ్యులు, సిపిఎం, సిపిఐకి చెందిన ఒక్కో సభ్యుడు సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. వర్షాకాల సమావేశాలలో మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలియచేసిన సమయంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్‌కు చెందిన ఫూలో దేవి నేతమ్, ఛాయా వర్మ, రిపున్ బోరా, రాజామణి పటేల్, సయ్యద్ నజీర్ హుస్సేన్, అఖిలేష్ ప్రసాద్ సింగ్, టిఎంసికి చెందిన డోలా సేన్, శాంతా ఛేత్రి, శివసేనకు చెందిన ప్రియాంక చతుర్వేది, అనిల్ దేశాయ్, సిపిఎంకు చెందిన ఎలమరం కరీం, సిపిఐకి చెందిన బినయ్ విశ్వంను ప్రస్తుత సమావేశాల నుంచి ససెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన డిప్యుటీ చైర్మన్ సభను మంగళవారానికి వాయిదా వేశారు.
రాజ్యసభ నుంచి 12 మంది ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -