ప్రముఖ టెలికాం సంస్థ జియో తన కస్టమర్లకు అనేక రకాల ప్లాన్‌లను అందిస్తోంది. ఇటీవల రీచార్జ్ ప్లాన్ల ధరలను పెంచిన జియో కస్టమర్లను ఆకర్షించేందుకు అనేక ప్రయోజనాలతో సరసమైన ప్లాన్లను అందిస్తున్నాయి. కంపెనీ కొన్ని ప్రత్యేక ప్లాన్‌లను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే? 12 OTT యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను ఇస్తుంది. అలాంటి ఈ ప్లాన్ గురుంచి మనం ఇప్పుడు తెలుసుకుందాం
రిలయన్స్ జియో రూ. 448 ప్రీపెయిడ్ ప్లాన్ గురించి మాట్లాడితే.. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అంతేకాకుండా.. ఈ ప్లాన్‌లో కస్టమర్‌లు ప్రతిరోజూ 2GB డేటాను పొందుతారు. ఈ విధంగా ఈ ప్లాన్‌లో మొత్తం వ్యాలిడిటీలో కస్టమర్‌లు మొత్తం 56 GB డేటా పొందుతారు. విశేషమేమిటంటే? ఈ ప్లాన్ ద్వారా అర్హత కలిగిన కస్టమర్‌లకు అపరిమిత 5G డేటాకు కూడా యాక్సెస్ పొందుతారు. అయితే, ఒకవేళ 2GB రోజువారీ డేటా పరిమితిని అయిపోతే ఇంటర్నెట్ వేగం 64 Kbpsకి తగ్గుతుంది.
ఇకపోతే, ఈ ప్లాన్‌లో కస్టమర్‌లకు లోకల్ + STD + రోమింగ్‌లో అపరిమిత కాల్స్ కూడా పొందొచ్చు. అంతేకాకుండా.. ఈ ప్లాన్‌లో కస్టమర్‌లు ప్రతిరోజూ 100 SMSలను కూడా పొందుతారు. వీటన్నింటితో పాటు.. సోనీ లైవ్, జి5, జియో సినిమా ప్రీమియమ్, లయన్ గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ నెక్స్ట్, కంచ లంక, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, ఫ్యాన్ కోడ్,హొయిచోయ్, జియో టీవీ వంటి 12 OTT యాప్‌లకు కూడా యాక్సెస్ పొందొచ్చు. జియో సినిమా ప్రీమియం కూపన్ నా జియో ఖాతాకు యాడ్ అవుతుంద. ఇది కాకుండా.. ఈ ప్లాన్‌లో కస్టమర్‌లు జియోక్లౌడ్‌కు యాక్సెస్ కూడా వస్తుంది.