Wednesday, January 22, 2025

రౌడీ షీటర్ ఇబ్బు హత్య కేసులో 12 మంది అరెస్టు

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ : రౌడీ షీటర్ ఇబ్రహీం చౌస్ (ఇబ్బు)ను హత్య చేసిన కేసులో 12 మందిని అరెస్టు చేసినట్లు ఎసిపి వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం నగరంలోని 6వ టౌన్ పోలీసు స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలోని బాబాసాహెబ్ పహడీ ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ ఇబ్రహీం చౌస్ (ఇబ్బు)ను జనవరి 1న రాత్రి 9 గంటల ప్రాంతంలో సారంగపూర్‌లో హత్య చేశారని, వీరిలో 12 మందిని ఈనెల 4న తెల్లవారుజామున అరెస్టు చేయడం జరిగిందన్నారు.
అరెస్టు చేసిన వారిలో నగరంలోని ముజాహిద్‌నగర్‌కు చెందిన సయ్యద్ ఆరిఫ్, ఆటోనగర్‌కు చెందిన అమీర్ అలీఖాన్, మాలపల్లిలోని వాటర్ ట్యాంకు వద్ద నివాసముంటున్న మహ్మద్ అజీద్ అహ్మద్, ముజాహిద్‌నగర్‌కు చెందిన షేక్ అజ్మత్, పెయింటర్ కాలనీకి చెందిన షేక్ ఖాదర్, ధర్మపురి హిల్స్‌కు చెందిన షేక్ మోయిజ్, నెహ్రునగర్‌కు చెందిన మిర్జా ఖార్జా బేగ్, ఆటోనగర్‌కు చెందిన సయ్యద్ ముజాసిద్, నెహ్రునగర్‌కు చెందిన షేక్ సజీం, నెహ్రునగర్‌కు చెందిన షేక్ అర్షద్, ఆటోనగర్‌కు చెందిన అబ్దుల్ ఫదల్, అహ్మద్‌పురా కాలనీకి చెందిన ఇర్రాఫాన్ ఖాన్‌లను అరెస్టు చేసినట్లు తెలిపారు. కాగా ఆటోనగర్‌కు చెందిన సయ్యద్ ఉస్మాన్ పరారీలో ఉన్నాడని తెలిపారు.
సిపి కెఆర్. నాగరాజు ఆదేశాల మేరకు డిసిపి అరవింద్‌బాబు సూచనలతో ఆరవ టౌన్ సిఐ జంగడం నరేష్ ఆధ్వర్యంలో నేరస్తులను పట్టుకోవడం జరిగిందన్నారు. ఇక ఇబ్రహీం చౌస్, సయ్యద్ అరిఫ్ అతని అనుచరులు చాలా కాలంగా చట్టవిరుద్ద కార్యక్రమాలు చేసేవారని, వారి మీద వన్‌టౌన్, 5వ టౌన్, 6వ టౌన్ పిఎస్‌లో కేసులు నమోదు అయి ఉన్నాయన్నారు. వీరిపై పిడి యాక్టు కేసులను నమోదు చేయడం జరిగిందన్నారు. ఒక సంవత్సరం క్రితం సయ్యద్ ఆరిఫ్, ఉస్మాన్ విడుదల కాగా మూడు నెలల క్రితం ఇబ్బు జైలునుంచి విడుదల అయ్యారు. ఈ మూడు నెలల కాలంలో ఒకరిపై ఒకరు ఆధిపత్యం కొనసాగిస్తూ వస్తున్నారు.
రైస్, భూతగాదాలతో ఇబ్బు వాటాను అడుగుతున్నాడని ప్రతి విషయంలో అడ్డు తగులున్నాడని భావించి జనవరి 1న నిందితులందరూ కలిసి షేక్ అర్షద్ బర్త్‌డే పార్టీకి ఇబ్బును నెహ్రునగర్‌లోని బషీర్‌ఫాం హౌజ్‌కి పిలిపించారు. రాత్రి 9 గంటలకు ఇబ్రహీం చౌస్‌తో గొడవ పెట్టుకొని సయ్యద్ అర్షద్, అమీర్ అలీఖాన్, బరసత్ అమేర్‌లు వారి వెంట తెచ్చుకున్న కత్తులతో ఇబ్బును పొడిచారు. ఆ సమయంలో ఇబ్బు డ్రైనేజీలో పడిపోగా తల మీద ఎజాజ్, సునరం అమ్జాత్‌లు తలపైన, మొఖంపై బండరాళ్లు వేసి చంపివేయడం జరిగిందన్నారు. విలేకరుల సమావేశంలో రూరల్ సిఐ నరేష్, టౌన్ ఎస్ఐ సాయికుమార్, రూరల్ సిఐ లింబాద్రి, మోపాల్ ఎస్ఐ మహేష్, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News