Thursday, January 23, 2025

ఉత్తరాఖండ్ లో భారీ వర్షానికి 12 మంది బలి

- Advertisement -
- Advertisement -

బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి 20-25 మీటర్ల మేర నడవ కొట్టుకుపోవడంతో కేదార్‌నాథ్‌కు వెళ్లే దారిలో మొత్తం 450 మంది యాత్రికులు భీంబాలి దాటి గౌరీకుండ్-కేదార్‌నాథ్ ట్రెక్ మార్గంలో చిక్కుకుపోయారు.

ఉత్తరాఖండ్‌లోని వివిధ ప్రాంతాల్లో రాత్రిపూట కురిసిన భారీ వర్షాల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో సహా 12 మంది మరణించారు , ఆరుగురు గాయపడ్డారు, ఇందుకు ఇళ్లు కూలిపోవడం, వరదలు , అనేక నదుల నీటి మట్టాలు పెరగడం వంటి అనేక సంఘటనలు ప్రేరేపించాయని అధికారులు గురువారం వెల్లడించారు.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం వరకు ఎలాంటి వర్షాలు పడలేదు. హరిద్వార్ జిల్లాలో ఆరుగురు, టెహ్రీలో ముగ్గురు, డెహ్రాడూన్ లో ఇద్దరు, చమోలీలో ఒకరు మరణించారు. హల్ద్వానీ ,  చమోలీలో ఒక్కొక్కరు ఇంకా కనిపించకుండా పోయారని ఇక్కడి డిజాస్టర్ కంట్రోల్ రూమ్ తెలిపింది. ఇదిలావుండగా డెహ్రాడూన్‌లోని రాయ్‌పూర్ ప్రాంతంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సమీపంలో పొంగిపొర్లుతున్న సీజనల్ కెనాల్‌లో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారని డెహ్రాడూన్ ఎస్‌ఎస్‌పి అజయ్ సింగ్ తెలిపారు.

ఇదిలావుండగా భారత వాతావరణ శాఖ (ఐఎండి) ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ‘రెడ్ అలెర్ట్’ ప్రకటించింది. భారీ వర్షాలకు, వరదలకు ఆస్కారం ఉందని తెలిపింది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News