- Advertisement -
మెక్సికో : మెక్సికో లోని ఓ బార్‌లో ఆదివారం ఓ సాయుధుడు కాల్పులు జరపడంతో 12 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. ముగ్గురు గాయపడ్డారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టామని, త్వరలోనే పట్టుకుంటామని అధికారులు పేర్కొన్నారు. గ్వానాజువాటో లోని ఇరాపుయాటోలోని బార్‌లో కాల్పులు జరిగాయని చెప్పారు. అయితే కాల్పులకు కారణాలు తెలియరాలేదు. ఇదిలా ఉండగా, మెక్సికోలో తుపాకీ దాడులు పెరుగుతున్నాయి. గత నెలరోజుల్లో ఇలాంటి సంఘటన జరగడం ఇది రెండోసారి. నెల రోజుల కిందట నైరుతి మెక్సికోలోని గెరెరోలో సిటీహాల్‌లో జరిగిన కాల్పుల ఘటనలో మేయర్ సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
- Advertisement -