Wednesday, January 22, 2025

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

జైపూర్ : రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది చనిపోయారు. 11 మంది గాయపడ్డారు. మృతులు గుజరాత్‌కు చెందిన వారు. గుజరాత్ నుంచి బస్సులో ప్రయాణికులు ఉత్తరప్రదేశ్‌లోని మథురకు వెళ్లుతుండగా వెనుక నుంచి వచ్చిన ఓ భారీ ట్రాలర్ ట్రక్కు ఢీకొందని పోలీసులు తెలిపారు. ఘటన లఖాన్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికంగా సమీపంలో ఉండే హంత్రా కల్వర్ట్ వద్ద దుర్ఘటన జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News