Tuesday, April 8, 2025

టొరంటో పబ్ కస్టమర్లపై కాల్పులు

- Advertisement -
- Advertisement -

తూర్పు టొరంటో పబ్‌లోకి ముగ్గురు వ్యక్తులుప్రవేశించి ఎలాంటి హెచ్చరిక చేయకుండానే నిర్దయగా కాల్పులు జరపడంతో డజను మందికి గాయాలయ్యాయి. టొరంటో పోలీస్ సూపరింటెండెంట్ పాల్ మాక్లంటైర్ ఈ వివరాలు వెల్లడించారు. కాగా శుక్రవారం రాత్రి 10.40 గంటలకు పైపర్ ఆర్మ్ వద్ద కాల్పులు జరుగుతున్నాయని అనేక ఎమర్జెన్సీ కాల్స్ అందాయని కూడా ఆయన తెలిపారు. ఇప్పటి వరకైతే ఎవరినీ అరెస్టు చేయలేదని సమాచారం. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి పోలీసులు తరలించారు. అయితే ఎవరికీ ప్రాణాపాయ స్థితిలేదని కూడా స్పష్టం చేశారు. ఆ ముగ్గురు అగంతకులు ఎందుకు కాల్పలు జరిపారన్నది ఇంకా తెలియరాలేదు. ఇదిలావుండగా టొరొంటో మేయర్ ఓలివియా చౌ… తాను పోలీస్ చీఫ్ మైరన్ డెమ్కివ్‌తో మాట్లాడనని, అన్ని వనరులను మోహరించామని వివరించారు. బాధితులు, వారి కుటుంబాల పట్ల తన సానుభూతిని పంచుకుంటున్నట్లు కూడా ఆమె తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News