Wednesday, January 22, 2025

శిక్ష పూర్తయి స్వదేశానికి చేరుకున్న 12 పాక్ ఖైదీలు

- Advertisement -
- Advertisement -

12 prisoners repatriated to Pakistan

న్యూఢిల్లీ : జైలు శిక్ష పూర్తి చేసుకున్న 12 పాక్ ఖైదీలు అట్టరివాఘా భూ సరిహద్దు మీదుగా స్వదేశానికి చేరుకున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ గురువారం వెల్లడించింది. అలాగే ఈ ఏడాది ఇంతవరకు పాక్ నిర్బంధంలో ఉన్న 20 మంది మత్సకారులను పాక్ నుంచి విడుదల చేయించి రప్పించుకున్నట్టు వివరించింది. పాక్ జాతీయులైన 12 మందిలో ఆరుగురు మత్సకారులని భారత్ లోని పాకిస్థాన్ హైకమిసన్ పేర్కొంది. పాక్‌లో తమ కుటుంబాలను చేరుకున్న ఖైదీల్లో 80 ఏళ్లకు మించిన వయోవృద్ధుడు ముహమ్మద్ నజీర్ ఉన్నారని వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News