జోహాన్నెస్‌బర్గ్: భారతదేశంలో అంతరించిపోతున్న అత్యంత అరుదైన చిరుతపులుల సంతతిని వృద్ధి చేయడానికి చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగంగా దక్షిణాఫ్రికా నుంచి తొలి విడతగా 12 చిరుతలు వచ్చే నెలలో భారతదేశానికి చేరుకోనున్నాయని అధికారులు తెలిపారు. చిరుతపులులను ఏ ప్రాంతంలో విడిచిపెట్టాలో అధ్యయనం చేసేందుకు భారత్‌ను సందర్శించిన వన్యప్రాణి నిపుణుల బృందం శుక్రవారం దక్షిణాప్రికాకు తిరిగివచ్చింది. భారత్‌కు తరలించే చిరుత పులులలో 9 చిరుతలను లింపుపో ప్రావిన్సులోని వన్యప్రాణుల వైద్యుడు డాక్టర్ యాండీ ఫ్రేసర్ నిర్వహించే రూబెర్గ్ వెటరినరి సర్వీసెస్‌లో క్వారంటైన్ చేయగా మరో మూడు చిరుతలను క్వాజులు నాటాల్ ప్రావిన్సులోని ఫిండరా గేమ్ రిజర్వ్‌లో క్వారంటైన్ చేసినట్లు అధికారులు తెలిపారు. వచ్చే నెలలో భారత్ చేరుకోనున్న చిరుతల వెంట ఫ్రేజర్‌తోపాటు తాను కూడా వెళుతున్నట్లు దక్షిణాఫ్రికా చిరుత పులుల నిపుణుడు ప్రొఫెసర్ ఆడ్రియన్ టోర్డిఫ్ తెలిపారు. తాము పంపుతున్న 12 చిరుతలతోపాటు మరో 8 చిరుతలు వచ్చే వార నమీబియా నుంచి భారత్ వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.
అక్టోబర్‌లో ఇండియాకు రానున్న 12 దక్షిణాఫ్రికా చిరుతలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -